ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్‌బాబు,పోలీస్ స్టేషన్‌లో ఎస్సైమాలోతు సురేష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాధిక,గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి కే.వెంకటేశ్వర్లు జెండా ఎగురవేశారు.రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్,పశు వైద్యశాలలో వైద్యాధికారిని సౌమ్య చందర్,ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వప్న జెండా ఆవిష్కరించారు.అలాగే మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం రాముల నాయక్,ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్ యాలాద్రి, బీసీ హాస్టల్‌లో వార్డెన్ గంట భాస్కర్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉపసర్పంచ్ కాస యాకయ్య, మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,మండల యువజన అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్,వార్డు సభ్యులు గోపి,కొంపెల్లి యాకయ్య, ఎల్లావుల ఉపేందర్,ఎస్.కె. హసీనా తదితర ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


