శివాజీ నగర్‌లో వృద్ధుడి ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి వృద్ధుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. శివాజీ నగర్‌కు చెందిన బొమ్మిడి నర్సింగం (63) గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో పాటు మధుమేహం, నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 26-01-2026 అర్ధరాత్రి సుమారు 2.30 గంటలకు ఇంటి బయటకు వెళ్లిన నర్సింగం తిరిగి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు 3.15 గంటల సమయంలో ఇంటి బయట మెట్ల వద్ద ఉన్న స్తంభానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని వేలాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కరీంనగర్‌కు తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


