టీజీవో భవన్‌లో గణతంత్ర వేడుకలు
కాకతీయ, ఖమ్మం: 77వ గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో టీజీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాదని వారు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.


