ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ, గీసుగొండ: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వి. కృష్ణవేణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ లో సీఐ డి.విశ్వేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మండల వైద్యాధికారులు డా. శరణ్య, డా. అరుణ్ కుమార్ లు పతాకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీఓ పాక శ్రీనివాస్,సూపరింటెండెంట్ కమలాకర్, పిఆర్ డిఈ జ్ఞానేశ్వర్, ఏఈ అనిల్,నయాబ్ తహసిల్దార్ రవీందర్ రావు, గిరిధవార్లు సాంబయ్య, శ్రీధర్,సర్వేయర్ భాస్కర్, ఏఎస్ఓ ఉదయశ్రీ,ఎస్సైలు కుమార్,రోహిత్,ఏఎస్ఐలు సుదర్శన్,శ్రీనివాస్ తో పాటు సంబంధిత కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


