చింతం వెంకటలక్ష్మికి ఘన నివాళి..
కాకతీయ,గీసుగొండ : బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ మొగిలిచెర్ల వాస్తవ్యులు చింతం సదానందం తల్లి చింతం వెంకటలక్ష్మి ప్రథమ వర్ధంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్, శాసనమండల ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,పెద్ది సుదర్శన్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దసాని సహోదర రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నేతలు చింతం వెంకటలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఆమె సేవాభావం, కుటుంబానికి అందించిన ఆదర్శ విలువలను వారు స్మరించుకున్నారు.చింతం సదానందం కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 15,16,17 డివిజన్ల కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.


