సమ్మక్క జాతరకు రండి సార్
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వింజపల్లి గ్రామస్థుల ఆహ్వానం
కాకతీయ, కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు హాజరుకావాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి *పొన్నం ప్రభాకర్ గౌడ్*ను గ్రామ పంచాయితీ పాలకవర్గం, నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రాల రాజేశ్వర్ రెడ్డి, అన్నాడి జీవన్ రెడ్డి, శెట్టి సుధాకర్, రంగనవేని వెంకటస్వామి, దూలం శ్రీనివాస్, బద్దం భగవాన్ రెడ్డి, బద్దం రాజిరెడ్డి, సామ మనిందర్ రెడ్డి, చేను తిరుపతి, అన్నాడి రాజేందర్ రెడ్డి, కొమ్ముల సునీల్ రెడ్డి, గర్రెపల్లి రవీందర్, పెసరు రాజయ్య, గర్రెపల్లి పర్షరాములు, నంగునూరి శ్రీనివాస్, చిట్యాల సదానందం తదితరులు పాల్గొన్నారు.


