జాతీయ జెండాను ఎగురేసిన గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, జాతీయ సమైక్యతను ప్రతి పౌరుడు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


