ప్రజా సమస్యలను వెలికితీస్తున్న కాకతీయ కథనాలు
బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కాకతీయ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి
కాకతీయ, హుస్నాబాద్ : ప్రజాక్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను కాకతీయ దినపత్రిక కథనాలు ప్రతిబింబిస్తున్నాయని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ, ప్రత్యేక శైలిలో వినూత్న కథనాలు అందిస్తున్న కాకతీయ దినపత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జర్నలిజం అంటే నిజాలను నిర్భయంగా వెలికి తీయడమేనని, పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక హుస్నాబాద్ ఆర్సీ ఇన్‌చార్జి సతీష్‌తో పాటు వివిధ మీడియా, పత్రిక చానెళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.


