లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని వెంకట సాయి హాస్పత్రి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గంజి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా డయబెటీక్ చైర్మన్ డాక్టర్ చెరుకు శ్రీనివాస్, సెక్రెటరీ సురేందర్, బాల నర్సయ్య, పూర్మ వెంకట్ రెడ్డి లక్ష్మణ్, పెద్ది తిరుపతిరెడ్డి,పేద్ది రమేష్,ఆకుల రమేష్, యామసాని లక్ష్మణ్, రాజలింగారెడ్డి,ధర్మరాజు, సమ్మిరెడ్డి,ఆరోగ్యరెడ్డి తో పాటు తదితరులు పాల్గొని ఈ సందర్భంగా దేశ ప్రజలకు వారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు


