epaper
Monday, January 26, 2026
epaper

సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ

సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు అద్దం ప‌డుతున్న పత్రిక క‌థ‌నాలు
తక్కువ కాలంలోనే పాఠకుల మన్నన
విశ్వసనీయ పత్రికగా ప్రజల ఆదరణ
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్ర‌శంస‌
క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించి యాజ‌మాన్యానికి అభినంద‌న‌లు

కాకతీయ, చేర్యాల : పత్రికలు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల పట్టణంలో కాకతీయ దినపత్రిక నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి వార్తా కథనం ప్రజల సమస్యలను కళ్లముందు జరిగినట్టుగా చూపిస్తోందని ప్రశంసించారు. కాకతీయ పత్రిక తన కథనాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంచలన వార్తా కథనాలకు కాకతీయ పత్రిక కేరాఫ్‌గా నిలుస్తోందని, నిజానిజాలను వెలికి తీసి సమాజానికి చేరవేయడంలో ఎప్పుడూ ముందుంటోంద‌ని అన్నారు. అతి తక్కువ కాలంలోనే కాకతీయ పత్రిక ప్రజలకు చేరువై, పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుందని కొనియాడారు. ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పంపిస్తూ ప్రజలకు, అధికారులకు మరింత దగ్గరైందని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలు కాకతీయ పత్రికను విశ్వసనీయ దినపత్రికగా ఆదరిస్తున్నారని, తాను ప్రతిరోజూ కాకతీయ పత్రిక చదవుతుంటాన‌ని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉడుముల భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, సిద్దిపేట జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ గౌడ్, కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, మాజీ కౌన్సిలర్ ఆడెపు నరేందర్, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి శ్రీధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చెవిటి లింగం, అల్లం శ్రీనివాస్, బూడిగే వెంకటేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకతీయ పత్రిక ప్రజా పక్షంగా నిలుస్తూ, నిజాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువస్తోందన్న అభిప్రాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతల మాటల్లో వ్యక్తమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకతీయ, చేర్యాల : చేర్యాల...

ఢిల్లీ ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు నాగపురి రైతులు

ఢిల్లీ ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు నాగపురి రైతులు కాకతీయ, చేర్యాల : రైతు...

ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య

ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య అనాథ‌లుగా భార్య, ఇద్దరు కుమార్తెలు అనారోగ్యం–చికిత్సలతో పెరిగిన...

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయధం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయధం మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ...

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి...

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇంచార్జి...

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్ మహిళా సమైక్య భవనానికి...

చేర్యాలలో గులాబీ జోరు

చేర్యాలలో గులాబీ జోరు బీఆర్‌ఎస్‌లోకి వీరబత్తిని సదానందం ఎమ్మెల్యే పల్లా సమక్షంలో చేరిక కేసీఆర్‌ పేరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img