epaper
Sunday, January 25, 2026
epaper

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ
50 మంది వృద్ధులకు నిత్యవసరాలు, బట్టలు
అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవంలో సరుకుల‌ పంపిణీ

కాకతీయ, తొర్రూరు : అనాథ‌ వృద్ధుల ఆదరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరులోని లయన్స్ క్లబ్ భవనంలో బాలవికాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాధ వృద్ధులకు నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. కెనడా దేశానికి చెందిన బేతిన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలవికాస ఆధ్వర్యంలో 50 మంది అనాధ వృద్ధులకు బియ్యం, నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన బాలవికాస ప్రోగ్రాం డైరెక్టర్ లతా… కొడుకులు, బిడ్డలు లేక నిరుపేద స్థితిలో ఉన్న వృద్ధులను గుర్తించి, ధర్మదాతల సహకారంతో ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. బాలవికాస పనిచేస్తున్న 28 గ్రామాల పరిధిలోని అనాధ వృద్ధులకు ఈ సాయం అందించామని పేర్కొన్నారు.

దాతల సహకారంతో రూ.1.75 లక్షల విలువైన సాయం

ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి మొత్తం రూ.1 లక్ష 75 వేల విలువైన సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. రియాల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ అనాధ వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాతలందరికీ బాలవికాస ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామ్ నర్సయ్య, సెక్రటరీ రవీందర్ రెడ్డి, ఓంకార్ జ్యువెలర్స్ రాధాకృష్ణ, గుర్తూరు సర్పంచ్ విస్సంపల్లి కవిత–బాలకృష్ణ, ఎన్నమనేని శ్రీనివాసరావు, శ్రీమాతా ఆయిల్ నిర్వాహకులు రేవూరి శ్రీధర్, ఆస్మా రావుల అనిల్, పెద్దగాని వెంకన్న, సెంటర్ మేనేజర్ వై.రమ, మెయిన్ కో–ఆర్డినేటర్ ఎం.రమ, జె.శైలజ, శోభారాణి, ఎం.సరిత, బాలవికాస మహిళలు తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?!

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?! ప్రభుత్వాలు మారినా… పాలేరు తిప్పలు తీరవా! భారీ వర్షాలకు కొట్టుకుపోయిన...

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్ కాకతీయ, రాయపర్తి : మహబూబాబాద్...

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం సామాజిక సేవలకు దక్కిన గౌరవం మహానంది అవార్డుతో...

మేడారం పనుల్లో అలసత్వం

మేడారం పనుల్లో అలసత్వం క్యూలైన్లు పూర్తి కాక‌పోవ‌డంతో భ‌క్తుల్లో ఆందోళన కొనసాగుతునే ఉన్న విద్యుత్...

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి గుర్తింపు గ‌వ‌ర్న‌ర్ చేతుల...

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు క్షేత్ర‌స్థాయిలో ఎస్పీతో క‌లిసి మంత్రి సీత‌క్క ప‌రిశీల‌న‌ చిలకలగుట్టలో భక్తుల...

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి మేడారంలోయశస్విని,ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరిని...

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంపై అధికారుల నిర్లక్ష్యం సౌకర్యాల లేమితో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img