అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి
మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ
మున్నూరుకాపు ఉద్యోగులు–విశ్రాంత ఉద్యోగుల 2026 డైరీ ఆవిష్కరణ
సంఘటితంగా ముందుకు సాగాలి : వక్తల పిలుపు
కాకతీయ, ఖమ్మం : మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని రంగాల్లో తమ సత్తాను చాటుతూ సంఘటితంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట సమీపంలోని పీవీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ డైరీని ఖమ్మం మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్.జె.సి కృష్ణ, మున్నూరుకాపు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు *డాక్టర్ బాల శ్రీనివాస్*తో పాటు ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మున్నూరుకాపు కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో మున్నూరుకాపులు తమ ప్రభావాన్ని అన్ని రంగాల్లో స్పష్టంగా చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
సంఘటిత శక్తిగా ఎదగాలి
సంఘటితంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని, ఉద్యోగులు–విశ్రాంత ఉద్యోగులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వక్తలు సూచించారు. సమాజాభివృద్ధితో పాటు యువతకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా మున్నూరుకాపు పెద్దలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల భారీ సంఖ్యలో పాల్గొని సంఘ కార్యకలాపాలకు మద్దతు తెలిపారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెద్ద బోయిన నాగరాజు, కర్నాటి సోమయ్య, నిర్మల సూరిబాబు, మేకల బిక్ష్మయ్య, ఏనుగుల రాజు పటేల్, సత్యనారాయణ పటేల్, పసుపులేటి శ్రీనివాస్, పగడాల రాంప్రసాద్, రాకం శ్యామ్ బాబు, శారద రంగ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 2026 డైరీని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు విశేషంగా ఆదరించారు.


