కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన లో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా కు వచ్చారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తండ్రి కొండపల్లి రాఘవ రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు,వైద్యులు పాల్గొన్నారు.


