కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలో లోపాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయంపై కేసీఆర్ మరింత దృష్టి సారించారు. హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత హరీశ్ రావు ఎర్రవెల్లికి వెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్, దామోదర్ రావు వంటి పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
కేసీఆర్ తో పార్టీ నేతల సమావేశం.. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


