పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం
సామాజిక సేవలకు దక్కిన గౌరవం
మహానంది అవార్డుతో సత్కారం
కాకతీయ, వరంగల్: సామాజిక సేవా రంగంలో విశేష కార్యక్రమాలు నిర్వహించిన వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన సామాజికవేత్త మియపురం శ్రీకాంత్ చారి ప్రతిష్టాత్మక మహానంది అవార్డు అందుకున్నారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల – 2026 సందర్భంగా హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విజయధారి ఫౌండేషన్, శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి, కాళోజి తెలుగు బుక్ అఫ్
రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాలను ఆదివారం ప్రధానం చేశారు. ఎన్నో సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహించిన మియపురం శ్రీకాంత్ చారిని మహానంది అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపకుడు శాంతి కృష్ణ మాట్లాడుతూ కరోనా ముందు నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టిన శ్రీకాంత్ చారిని అభినందించారు. ఆయన చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రహంశించారు. చిన్న వయసులోనే సామాజిక దృక్పథం కలిగి, విశిష్ట సేవలందించిన ఆయనను కొనియాడారు. ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్న శ్రీకాంత్ ను యువత ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవలో పాల్గొని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. తెలుగు వెలుగు సాహితి వేదిక నిర్వాహకులు పోలోజు రాజ్ కుమార్, శాంతి కృష్ణ, పొన్నేకంటి శ్రీనివాస్, యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్. నంద తదితరుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి నుంచి వచ్చి హాజరైన పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


