ఆర్కే వన్,గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్ల పరిశీలన
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించబోయే ఆర్కే వన్ సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను ఆదివారం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ పరిశీలించారు. సింగరేణి ఆద్వర్యంలో నిర్వహించే జాతరకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను,పరిసరాలను పరిశీలించారు. అలాగే బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా వద్ద ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగబోయే మైసమ్మ జాతర ఏర్పాట్లను మందమర్రి సీఐ రమేష్,ఆర్కేపీ ఎస్సై శ్రీధర్ లతో కలిసి ఏసిపి పరిశీలించారు. గుట్టపై,కింద దర్బార్ స్టేజి ఏర్పాట్లను పరిశీలించారు.ఇక్కడ కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు జాతరలకు వచ్చే భక్తులు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఆదివాసి,నాయక్ పోడు సభ్యులు పాల్గొన్నారు.


