epaper
Sunday, January 25, 2026
epaper

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి
హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం
మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యతతో ముందుకు సాగాలి
అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్

కాకతీయ, ఖమ్మం : యాదవులు తమ సాంప్రదాయ గొర్రెల పెంపకం వృత్తితో పాటు రాజకీయంగా కూడా బలంగా ఎదగాల్సిన అవసరం ఉందని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణేత శక్తిగా మారినప్పుడే యాదవులకు న్యాయం, హక్కులు సాధ్యమవుతాయని వారు స్పష్టం చేశారు. ఖమ్మంలోని చిత్తారు శ్రీహరి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లోదిగ వెంకన్న, *దుబాకుల శ్రీనివాస్ యాదవ్*తో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా యాదవ సంఘం క్యాలెండర్‌లను ఆవిష్కరించారు.

ఎన్నికల్లో ఐక్యతే కీలకం

మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత సర్పంచ్ ఎన్నికల్లో యాదవులు గణనీయంగా విజయం సాధించినప్పటికీ, జనాభా నిష్పత్తికి తగిన స్థాయిలో ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వర్గాలకతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల సహకారంతో యాదవులు ఐక్యంగా ముందుకు వచ్చి ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యాదవ ప్రముఖులు మాట్లాడుతూ… బీసీ వర్గాల్లో యాదవులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన స్థాయిలో ఎదగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు పరిష్కారంగా గొర్రెల పెంపకం వృత్తితో పాటు విద్యకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువత చదువుతో పాటు సంఘటితంగా రాజకీయాల్లో పాల్గొంటేనే భవిష్యత్తు భద్రమని అన్నారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా యాదవ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణం మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఇతర కుల సంఘాల మాదిరిగా ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల సంఘం సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఇవి అమలైతే యాదవ వృత్తిదారులకు ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, పొదిల సతీష్, పొదిలి తిరుపతిరావు, కనక బండి విజయలక్ష్మి, రాగం కోటేశ్వరరావు, సత్తి వెంకన్న, తోడేటి లింగరాజు, మురిమేకల కోటయ్య, వాకధాని కోటేశ్వరరావు, చిత్తారు సిద్ధు, బొల్లి కొమరయ్య, చల్ల వెంకటేష్, వాగదాని రాజు, రాగం బాబురావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి! విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి ఖమ్మంలో కాంగ్రెస్...

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర...

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్...

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం బీఎల్ఓల...

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి గెలుపే లక్ష్యంగా...

మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img