పెద్ద తండాలో ఎంపీ నిధులతో సెంట్రల్ లైటింగ్
ప్రారంభించిన సీనియర్ నాయకులు పూనమ్ వీరన్న నాయక్
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని పెద్దతండ (సీఎం) గ్రామంలో ఎంపీ బలరాం నాయక్ ఇచ్చిన నిధులతో పెద్ద తండ గ్రామ పంచాయతీ బంగరీ మైసమ్మ భూక్యా తండ లొ మండల పార్టీ అధ్యక్షులు సతీష్ ఇచ్చిన లైటులను గ్రామ పార్టీ అధ్యక్షులు బానోతు బాలు నాయక్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు పూనమ్ వీరన్న నాయక్ లైటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జరుపుల బిక్షం,
తెజవత్ సంతోష్, భూక్యా నరహరి, లావుడ్య శోభా శంకర్ తదితరులు పాల్గొన్నారు.


