47వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాయినగర్ కాలనీ, హరిజనవాడ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిన హామీలపై రూపొందించిన ‘బాకీ కార్డు’లను ప్రజలకు పంపిణీ చేస్తూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని పేర్కొంటూ, రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.


