వనదేవతలను దర్శించుకున్న సీపీ దంపతులు..
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించిన అనంతరం ఆలయ పూజారులు సీపీ దంపతులను శాలువాతో సత్కరించి, అమ్మవార్ల పసుపు, కుంకుమలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ములుగు ఎస్పీ కేకన్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులతో మేడారం జాతర సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.


