విద్యుత్ షాక్‌తో గేదె మృతి
రూ.లక్ష నష్టపోయామని బాధితురాలి ఆవేదన
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆకులవారి ఘనపురం గ్రామానికి చెందిన చిలుకూరి ఉమామహేశ్వరి యాజమాన్యంలోని సుమారు లక్ష రూపాయల విలువైన సుడి గెదా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వెళ్లే ప్రధాన రహదారిలో, రోయ్యూర్ గ్రామ సమీపంలోని పొలాల వద్ద ఈ ఘటన జరిగింది. పొలాల దగ్గర నిర్లక్ష్యంగా వదిలివేసిన విద్యుత్ తీగల కారణంగానే గెదా మృతి చెందిందని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన ఉమామహేశ్వరి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


