క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
కాకతీయ,చేర్యాల: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించగా గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతుల ప్రాథనోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.ఈ సందర్బంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చని పేర్కొన్నారు. క్రీడలు మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, దేహదారుడ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఆటల్లో గెలుపోటలములు పట్టుంచుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. క్రీడల వల్ల ఓర్పు, పట్టుదల, లక్ష్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయిస్తుందని కొమ్మూరి స్పష్టం చేశారు. రానున్న ఒలింపిక్ క్రీడలలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆకునూర్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి, ఉప సర్పంచ్ కడారి పల్లవి భాస్కర్,రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య,ఆత్మకమిటి డైరెక్టర్ జంబుల వెంకట్ రెడ్డి, ఆకునూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్, సినియర్ నాయకులు బోయిని రాజు, శేవల్ల రాజయ్య,కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ తొల్ల రాజేశ్వరి,వార్డు సభ్యులు,స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


