ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం
కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
కాకతీయ, చేర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేర్యాల మండల పరిధిలోని ఆకునూర్ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికావడం లబ్దిదారులు నూతన గృహప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు. జనగామ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం అని పునరుద్ఘాటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూర్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి, రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య, ఆత్మకమిటి డైరెక్టర్ జంబుల వెంకట్ రెడ్డి, ఆకునూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్, సినియర్ నాయకులు బోయిని రాజు,శేవల్ల రాజయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తొల్ల రాజేశ్వరి, వార్డు సభ్యులు,స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


