epaper
Saturday, January 24, 2026
epaper

ఖ‌మ్మంలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు

ఖ‌మ్మంలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు
కాంగ్రెస్‌లోకి కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు
మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 60 కుటుంబాలు
33వ డివిజన్‌లో పై చేయి సాధించే దిశ‌గా తుమ్మ‌ల వ్యూహం
కార్పొరేషన్‌ గెలుపే లక్ష్యంగా మంత్రి పావులు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు, ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌కు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని 33వ డివిజన్‌ కార్పొరేటర్ తోట వీరభద్రం ఆధ్వర్యంలో మొత్తం 60 కుటుంబాలు మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అభివృద్ధే కాంగ్రెస్‌ గుర్తింపు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీకి ప్రధాన బలం అని అన్నారు. ఖమ్మం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కేంద్రంగా రాజకీయాలు సాగాలని, అభివృద్ధి, సంక్షేమమే ప్రాతిపదికగా ముందుకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కుటుంబాలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ షేక్‌ లతీఫ్‌, దొంగరి చంద్రమౌళి, దాస్‌ మౌళి, పులిపాటి సంపత్‌కుమార్‌, నల్లబెల్లి గౌతం, అల్లం శ్రీను, శెట్టి రమేష్‌, వడ్డబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర ఖమ్మం మార్కెట్లో రైతుల ఆందోళ‌న‌ ఖరీదుదారుల మోసంపై రైతుల...

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం 17 వేల మంది కార్మికులను ఐఎఫ్ఎంఎస్‌లో...

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవం కాకతీయ,ఖమ్మం...

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఆలయ కమిటీ...

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. కాకతీయ , కూసుమంచి : తెలుగుదేశం...

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ అనుదీప్‌ ‘నా భారతదేశం–నా ఓటు’ థీమ్‌తో ఓటరు...

అడుగుపెడితే అరెస్టులే!

అడుగుపెడితే అరెస్టులే! రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరకు అనుమతి లేదు రిజర్వ్...

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img