యువ ప్రతిభకు టీజీఐసీ బలం
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : యువతలోని సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యువ ఆవిష్కరణలు పోటీ మార్కెట్‌కు అనుగుణంగా ఉండాలని సూచించారు. టీజీఐసీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఐటీ టవర్‌లో నిర్వహించిన ‘ఇన్నోవేషన్ పంచాయత్’లో వివిధ జిల్లాల నుంచి 60కిపైగా యువ వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిధుల సమీకరణ, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ అంశాలపై నిపుణులతో చర్చించారు. ఆవిష్కరణ అమలులో సవాళ్లు సహజమని, వాటిని అవకాశాలుగా మలచుకోవాలని కలెక్టర్ సూచించారు.


