జర్నలిస్ట్ కుటుంబానికి 60 వేల ఆర్థికసహాయం
కాకతీయ, నెల్లికుదురు : టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమీకరించిన రూ.60 వేల ఆర్థికసహాయాన్ని ఇటీవల మృతి చెందిన మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ లతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని అతను లేని లోటును పూడ్చలేనిదని ఆ భగవంతుడు కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు జిల్లా యూనియన్ జర్నలిస్టుల కమిటీ తరఫున తమ వంతు 60 వేల ఆర్థిక సహాయం అందజేశామని మరికొంతమంది జర్నలిస్టు కుటుంబానికి సహాయం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ జె యు జిల్లా నాయకులు, జిల్లా, మండల ప్రెస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


