సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం
మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఆలయ కమిటీ స్వాగతం
పూజారులతో కోయ నృత్యం, ప్రత్యేక పూజలు
కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామంలో నిర్వహించిన సమ్మక్క–సారక్క జాతరను వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మీలా తాళాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజారులతో కలిసి రాములు నాయక్ కోయ నృత్యంలో పాల్గొని జాతర ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైరా నియోజకవర్గ ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని వనదేవతలైన సమ్మక్క–సారక్కలను గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. జాతర కార్యక్రమాలకు ముందు సీనియర్ నాయకులు ఆడప పుల్లారావు నివాసంలో సంప్రదాయ తేనేరును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు భూక్యా పద్మా, కురసం సత్యనారాయణ, ఈసాల సొసైటీ చైర్మన్ ఈసాల నాగేశ్వరావు, నాయకులు అజ్మీర వీరన్న, భూక్యా రామ్‌కిషోర్, వాంకుడోత్ విజయ్, ఈదర కోటేశ్వరరావు, కాటేపల్లి నవీన్, ఈదర చలపతి, చాందిని, భూక్యా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


