కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు..
కాకతీయ , కూసుమంచి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుక శుక్రవారం కూసుమంచి ప్రధాన కూడలిలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షుడు మందపల్లి కోటేశ్వరరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలగాటి రామనాథం ,జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఇంటూరి నాగరాజు చౌదరి, జిల్లా నాయకులు గోపి వెంకన్న, ఉపాధ్యక్షుడు శివ, తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పల ఉదయ్, మండల తెలుగు రైతు అధ్యక్షుడు తుళ్లూరి భాస్కరరావు , మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవింద ఎల్లయ్య, జూనియర్ ఎన్టీఆర్ మండల శాఖ అధ్యక్షుడు ఐతగాని నవీన్ కుమార్ , నలగాటి స్వామి, మండల పార్టీ మైనారిటీ నాయకులు షేక్ దస్తగిరి బిసి సెల్ అధ్యక్షుడు మల్లబోయిన పిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.


