గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం
బైక్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టిన ఘటన
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
కాకతీయ, కల్లూరు : కల్లూరు మండలం లింగాల సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ హరిత తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ హరిత తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


