మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు
కాకతీయ, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మెట్టుగుట్ట రామాలయంలో శుక్రవారం ఐదు హుండీలను లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ ఆధ్వర్యంలో గిర్మాజిపేట శ్రీ దుర్గేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా నోట్ల రూపంలో రూ.90,870లు, నాణేల రూపంలో రూ.13,761లు సమకూరగా మొత్తం ఆదాయం రూ.1,04,631గా నమోదైంది. కార్యక్రమంలో అర్చకులు శ్రీ పరాశరం విష్ణువర్ధనాచార్యులు, శ్రీ రాగిచేడు అభిలాష్ శర్మ, శ్రీ పారుపల్లి సత్యనారాయణ శర్మతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ ఆదాయ లెక్కింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.


