విద్యార్థులకు నోటు బుక్స్ అందజేత
కాకతీయ, పెద్దవంగర :చదువులో ఎంతో చురుకుగా ఉండి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అఫ్ సేవ తరుణీ తోర్రుర్ వారు తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్దవంగర ఎక్స్ రోడ్డులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు అయిదు వెల రూపాయల విలువగల నోట్ బుక్స్ తో పాటు, నిత్యవసర సరుకులు సైతం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని పారిజాతసురేష్, ఉపసర్పంచ్ వినోద్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ,,సేవ తరుని అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి,ఉపాధ్యాయురాలు సౌభాగ్య ,అంగన్వాడి టీచర్మంజుల విద్యార్థులు పాల్గొన్నారు.


