ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
కాకతీయ, కోహెడ : సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఓటరుగా నమోదు అయిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయడం తమ ప్రాథమిక కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాములు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సురేందర్, రాములు, గ్రామ పరిపాలన అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


