epaper
Friday, January 23, 2026
epaper

ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు

వసూళ్లు షూరు
ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
లోడింగ్ చార్జీల పేరుతో లారీ డ్రైవర్లకు వేదింపులు
కలెక్టర్, సీపీ తనిఖీలు చేసినా మారని తీరు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇసుక రీచ్ నిర్వాహకులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక రీచ్‌ల నిర్వాహకుల అక్రమాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గినట్టుగా కనిపించిన అక్రమ వసూళ్లు మళ్లీ షూరు అయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణాపై ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు పూర్తి విరుద్ధంగా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఇసుక రీచ్‌లలో లోడింగ్ పేరుతో అక్రమ వసూళ్ల దందా తారస్థాయికి చేరడంతో లారీ డ్రైవర్లు ఈ అక్రమాలపై టీజీఎండీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఇసుక నిర్వహణ, రవాణా నిబంధనల ప్రకారం జరగాలని, లోడింగ్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై శాఖాపరమైన కేసులు నమోదు చేస్తామని అవసరమైతే రీచ్ నిర్వహణ అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరికలతో కూడిన కఠిన ఆదేశాలు జారీ చేశారు.

https://www.kakatiyanews.com/wp-content/uploads/2026/01/challuru-2.aac

యథేచ్ఛగా అక్రమ వసూళ్లు

కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక రీచ్‌లలో అక్రమ వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చినా మాకు ఏమీ కాదు అన్న తీరులో నిర్వాహకులు లోడింగ్ చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో లోడింగ్ చార్జ్, పట్టా, లెవలింగ్ తదితర కారణాలతో ఒక్కో లారీపై రూ.5,600 వరకు వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ అక్రమాలపై లారీ డ్రైవర్లు, ఇసుక లారీ అసోసియేషన్ సభ్యులు టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పట్లో నిర్వాహకులు లోడింగ్ చార్జీలను రూ.1,500కు కుదించి గుట్టుచప్పుడు కాకుండా వసూళ్లు కొనసాగించారు. అయితే అక్ర‌మంగా రూ.1,500 వసూళ్లపై కూడా లారీ డ్రైవర్లు, సంఘ నేతలు ప్రశ్నించడంతో కొంతకాలం వివిధ కారణాలు చెబుతూ లోడింగ్ ప్రక్రియను నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా మళ్లీ ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ చార్జ్, పట్టా, లెవలింగ్ పేరుతో అక్రమ వసూళ్ల బాగోతం తెరపైకి వచ్చింది. లోడింగ్ చార్జ్ పేరుతో ఒక్కో లారీపై రూ.3,200 వరకు వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు.

లోడింగ్ చార్జీల పేరుతో లారీ డ్రైవర్లకు వేదింపులు

కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్‌లలో లోడింగ్ చార్జీలు ఇవ్వకపోతే ఇసుక లోడింగ్ చేయబోమని నిర్వాహకులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. రూ.3,200 ఇవ్వకపోతే లారీలను గంటల తరబడి పక్కకు పెట్టి వేదింపులకు గురిచేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అక్రమాలన్నీ ఇసుక రీచ్ ల‌లోని సంబంధిత టీజీఎండీసీ ఏస్ఆర్‌వోల కళ్ల ముందే జరుగుతుండటం గమనార్హం. ఇందుకు నిదర్శనంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పరిధిలోని చల్లూరు ఇసుక రీచ్‌లో లోడింగ్ చార్జ్ ఇవ్వలేదన్న కారణంతో లారీలో ఇసుక లోడ్ చేయకుండా ఇసుక కోసం వ‌చ్చిన లారీని పక్కకు పెట్టిన ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ కాకతీయ దినపత్రిక చేతికి చిక్కింది.

క‌లెక్టర్, సీపీ తనిఖీలు చేసినా మారని తీరు

కరీంనగర్ జిల్లాలో ఇసుక రీచ్‌లలో జరుగుతున్న అక్రమాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఇటీవల అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణా, రీచ్‌ల నిర్వహణ నిబంధనల ప్రకారం జరగాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగినా ఇసుక‌ రీచ్‌లలో అక్రమాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో అన్ని చోట్ల పోటీ...

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు మంత్రి వివేక్‌పై విమర్శలకు అర్హత లేదన్న...

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి...

బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు

బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం ట్రాఫిక్ రూల్స్‌పై...

19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి

19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం బరిలోకి...

రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ

రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ కాకతీయ, కరీంనగర్ : రోడ్డు...

బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్

బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ బండి సంజయ్ సమక్షంలో కనుమల్ల విజయ–గణపతి...

కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము

కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ! 100 మందితో బీఆర్‌ఎస్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img