epaper
Tuesday, March 10, 2026
epaper

పురపోరుకు సై

పురపోరుకు సై
నర్సంపేటలో రాజకీయ వేడి
బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్
కీల‌కంగా మారనున్న బీజేపీ ప్ర‌భావం.. గెలుపు సీట్లు
గెలుపు గుర్రాల కోసం ప్ర‌ధాన‌ పార్టీల అన్వేషణ
ఎమ్మెల్యేకు ప్ర‌తిష్ఠాత్మ‌కం.. మాజీ ఎమ్మెల్యే భ‌విష్య‌త్‌కు ఉనికి త‌ప్ప‌నిస‌రి
నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో అటు శంకుస్థాపనలు… ఇటు నిరసనలు
స‌మీక‌ర‌ణాలు మార‌డంతో కండువా మార్చేస్తున్న పార్టీల నేత‌లు

కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీలో పురపోరుకు నేడో–రేపో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సూచనలతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌సీట్‌గా మారాయి. డివిజన్‌లు, వార్డుల రిజర్వేషన్లే కేంద్రంగా అన్ని పార్టీల్లో వ్యూహాత్మక చర్చలు సాగుతున్నాయి. రిజర్వేషన్లలో అవకాశం కోల్పోయిన కొందరు నేతలు సైలెంట్‌గా ఉండగా, అనుకూలంగా వచ్చిన వారు మాత్రం ఇప్పటికే గల్లీల్లో ఇంటింటి ప్రచారంతో ఓటర్లను చేరువ చేసుకుంటున్నారు. ఇటీవల శివారు గ్రామాల విలీనంతో మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 24 నుంచి 30కి పెరగడంతో అన్ని డివిజన్లలో రాజకీయ సందడి మరింత పెరిగింది. చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడం ప్రధాన పార్టీల మధ్య పోటీనీ ఉద్ధృతం చేసింది. టికెట్‌ తమకే వస్తుందన్న ధీమాతో కొందరు ఆశావహులు ప్రచారం ప్రారంభించగా, పోటీ ఎక్కువగా ఉన్న డివిజన్లలో మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకుల ఆశీస్సుల కోసం నేతలు లాబీయింగ్‌కు దిగారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ కార్యాలయాల వద్ద సందడి పెరిగింది. అనుకూల నేతలతో మాట్లాడించి టికెట్‌ దక్కించుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొందరు నేతలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చి పైరవీలు సాగిస్తున్నారు. పోటీ అధికంగా ఉన్న చోట అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారుతోంది.

ఎవరు గెలుస్తారు?

ప్రధాన పార్టీల నాయకత్వం డివిజన్‌ల వారీగా ‘గెలుపు గుర్రాల’ కోసం వడపోత మొదలుపెట్టింది. ఆయా డివిజన్లలో సామాజిక వర్గాల బలం, అభ్యర్థికి ఉన్న వ్యక్తిగత ఆదరణ, స్థానిక సమీకరణలను గణనలోకి తీసుకుని పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సగం వార్డులకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. మిగతా డివిజన్లలో ఒక్కో చోట రెండు పేర్లను పరిశీలిస్తూ ద్వితీయ శ్రేణి నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ గెలుపును అడ్డుకునేందుకు డమ్మీ అభ్యర్థుల వ్యూహాలపై కూడా చర్చ సాగుతోంది. ఎన్నికల సమీకరణలు మారుతుండటంతో పార్టీల మధ్య చేరికల జోరు పెరిగింది. గత వారం రోజులుగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీల్లో నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. అధికార పార్టీలో నుంచి బీఆర్ఎస్‌లోకి, బీఆర్ఎస్‌ నుంచి అధికార పార్టీలోకి మారుతున్న నేతలతో రాజకీయ వాతావరణం రోజురోజుకు మారుతోంది.

అటు శంకుస్థాపనలు… ఇటు నిరసనలు

ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయ కార్యకలాపాలు మరింత ఉధృతమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి విలీన గ్రామాలు, పట్టణ వార్డుల్లో సీసీ రోడ్లు, కులసంఘ భవనాలకు శంకుస్థాపనలు చేస్తుండగా, ప్రతిపక్ష నేతలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలో గతంలో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img