పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు
మంత్రి వివేక్‌పై విమర్శలకు అర్హత లేదన్న రఘునాథ్ రెడ్డి
కాకతీయ, రామకృష్ణాపూర్: వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారిన కార్యకర్తల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక సూపర్ బజార్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి తావు లేకుండా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న *వివేక్ వెంకటస్వామి*పై విమర్శలు చేసే అర్హత వారికి లేదన్నారు. పార్టీ బలంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పల్లె రాజు, వోడ్నల శ్రీనివాస్, జంగం కళ, మహంకాళి శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ విధానాలే ప్రజల గుండెల్లో ఉన్నాయని రఘునాథ్ రెడ్డి తెలిపారు.


