చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. రిమాండ్
కాకతీయ, చింతకాని : చోరీ కేసులో నిందుతుడిని అరెస్ట్ రిమాండ్ కు తరలించినట్లు చింతకాని ఎస్సై వీరేందర్ తెలిపారు.వందనం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్ రావు అతని కుటుంబ సభ్యులతో ఈనెల 15 తారీకు నాడు తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి 20వ తారీకు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉండగా గమనించి ఎవరో దొంగలు పడ్డారని ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు వస్తువులు వెండి వస్తువులు కొంత నగదు మరియు టీవీ కనిపించకపోవడంతో చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి అట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తిని ఈరోజు చింతకాని ఎస్ఐ తన సిబ్బందితో వందనం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా దొంగతనం చేసిన సొమ్ముతో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాకరకాయల నరేష్ (వందనం గ్రామం) అను వ్యక్తి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద నుండి దొంగతనం చేసిన వస్తువులను రికవరీ చేసి అతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. మరో నిందితుడు కందుకూరి సోమాచారి (సత్తుపల్లి) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు చెందించిన
ఎస్సై ఎన్ వీరేందర్, ఏ ఎసై లక్ష్మణ్ చౌదరి,ఎచ్ సిరాములు ఎచ్ సి శ్రీనివాస్ ,పీసీ గజేంద్ర ,పీసీ శ్రీనివాస్ వైరా ఇంచార్జ్ ఏసీపీ వసుంధర యాదవ్ అభినందించారు.


