అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
కామర్స్ విభాగంలో ఖాళీ పోస్టు
జనవరి 23లోపు దరఖాస్తులు
కాకతీయ, మణుగూరు: *ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో ఖాళీగా ఉన్న కామర్స్ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దొడ్డి భద్రయ్య తెలిపారు. ఈనెల 23 సాయంత్రం 4 గంటల లోపు అభ్యర్థులు అప్లికేషన్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎం.కాం.లో కనీసం 55 శాతం మార్కులు ఉండి, పీహెచ్‌డీ/నెట్/సెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జనవరి 23 తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబోమన్నారు. అర్హులైన అభ్యర్థులు సకాలంలో ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని కోరారు. ఇంటర్వ్యూలు జనవరి 24 ఉదయం 10 గంటలకు **శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, కొత్తగూడెం*లో నిర్వహించనున్నట్లు తెలిపారు


