epaper
Monday, March 9, 2026
epaper

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర
ఐదు లక్షలకు పైగా భక్తుల రాక అంచనా
ఈ నెల 28, 29న వనం విడిచి జనంలోకి సమ్మక్క–సారలక్కలు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
పులిగుండం వాగు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సరిసమానంగా పేరు గాంచిన గడ్డిగుట్ట మినీ మేడారం జాతరకు వేళాయె. లక్ష్మీదేవి పల్లి మండలం తడికలపూడి గడ్డిగుట్ట–వేపలగడ్డ ప్రాంతాల్లో నిర్వహించే ఈ జాతర ఈ నెల 28, 29 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనుంది. మేడారం జాతర ప్రారంభం కావడంతో అదే తరహాలో ఇక్కడి మినీ మేడారం జాతరపై భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. పూర్తిగా గిరిజన ప్రాంతంలో జరిగే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
ఈ జాతరను శుద్ధ గిరిజన సంప్రదాయాల ప్రకారమే నిర్వహించడం ప్రత్యేకత. ఆదివాసీ గిరిజన పూజారులే వనదేవతలకు సంబంధించిన పూజలు నిర్వహిస్తూ జాతర విశిష్టతను చాటుతున్నారు. గడ్డిగుట్ట వేపలగడ్డ ప్రాంతాల్లో జరిగే ఈ జాతర సందర్భంగా పులిగుండం వాగు దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన షాపులు, ఇతర సదుపాయాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా

రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. గత 50 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ జాతర విశిష్టతను గ్రామాల నుంచి పట్టణాల వరకు చాటేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ప్రచారం చేపట్టింది. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి, పులిగుండం, వేపలగడ్డ, హాలియా తండా, సర్వారం, బేతంపూడి, తడికలపూడి, తల్లాడ, జూలూరుపాడు, కాకర్ల, కొత్తగూడెం, రామవరం, సింగరేణి ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సమ్మక్క–సారలక్కలను దర్శించుకుంటారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో వనదేవతలు జనంలోకి వచ్చే ఘట్టం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. ఇందుకోసం గత పది రోజులుగా ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలక్కల కొలుపులతో గడ్డిగుట్ట ప్రాంతమంతా మంగళ వాయిద్యాలతో మార్మోగనుంది. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లక్ష్మీదేవి పల్లి పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

పులిగుండం వాగు వద్ద గట్టి నిఘా

దట్టమైన బండలతో ఏర్పడిన పులిగుండం వాగు వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అనుమతి లేకుండా వాగులోకి వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఈతగాళ్లను మోహరించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆలయ కమిటీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మినీ మేడారం జాతర ప్రధాన పూజారి ఊకే సీతమ్మ మాట్లాడుతూ.. గడ్డిగుట్ట ప్రాంతంలో గత 50 ఏళ్లుగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే ఈ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని, వనదేవతలను జనంలోకి తీసుకొచ్చే ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు. జాతరను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ బృందం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌ పాల‌సీ డ‌బ్బులు కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌తో మ‌ర్డ‌ర్‌ హ‌త్య‌ను ప్ర‌మాదంగా...

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..!

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..! పేదల సాగు భూములు స్వాధీనం చేయొద్దు ఎమ్మెల్యే కూనంనేని...

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..!

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..! నరసింహులగూడెంలో చిన్నపిల్లలకు పరీక్షలు కాకతీయ, కూసుమంచి : గ్రామీణ...

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..!

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..! ప్రతి రంగంలో సమానత్వం అవసరం టీజీవో రాష్ట్ర అధ్యక్షులు...

పోరాటాలతోనే హక్కుల సాధన..!

పోరాటాలతోనే హక్కుల సాధన..! మహిళలపై ఇంకా కొనసాగుతున్న వివక్ష మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి...

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..!

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..! మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళలకు చోటు ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు...

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img