epaper
Monday, March 9, 2026
epaper

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత‌

15 మంది మావోయిస్టులు మృతి

మృతుల్లో అగ్ర‌నేత ప‌తిరాం మాంఝీ

ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌గా కీల‌క బాధ్య‌త‌లు

అతడిపై ఆరు రాష్ట్రాల్లో కేసులు.. రూ. 5 కోట్ల రివార్డు

అధికారికంగా ధృవీక‌రించని పోలీసులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఝార్ఖండ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ప‌శ్చిమ సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీక‌ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీల‌క నేత‌, సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్ పితిరం మాంఝీ అలియాస్ అనల్ ఉన్నట్లు సమాచారం. అతనిపై ఆరు రాష్ట్రాలలో కేసులు, మొత్తం రూ. 5 కోట్ల రివార్డు కూడా ఉంది. కొన్నేళ్లుగా భద్రతా బలగాలపై దాడులకు ఇతడే పథకం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇక సింగ్భూం జిల్లాలో ఇంకా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆ ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ మావోలకు అతి పెద్ద దెబ్బ అని.. ఝార్ఖండ్‌లో నక్సలిజంపై భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయం అని అభివర్ణిస్తున్నారు.

ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌

2026 మార్చి నాటికి మావోయిస్టు రహితంగా దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్‌ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సహా మావోయిస్టుల‌ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్దఎత్తున సెర్చింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల వివరాలు, ఆయుధాలు గురించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం అయితే పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కూడా కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఆపరేషన్ కగర్‌తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్ప‌టికే ప‌లు ఎన్‌కౌంట‌ర్ల‌లో ప‌దుల సంఖ్య‌లో అగ్ర‌నేత‌లు హ‌తంకాగా.. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసులకు ఎదుట లొంగిపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

గణపతి లొంగుబాటు..!

గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img