మంటల్లో గడ్డివాము..పడగ విప్పిన నాగు!
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
కాకతీయ, కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో జరిగిన ఓ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వరి గడ్డివాముకు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో గడ్డివాములో ఉన్న నాగుపాము మంటల వేడికి బయటకు వచ్చి పడగ విప్పి నిలబడుతూ చాలా సేపు అలానే ఉంది. గడ్డివాము తగలబడుతున్న దృశ్యాల వైపే చూస్తూ ఉండటం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


