కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము
జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ!
100 మందితో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్
కాకతీయ, జమ్మికుంట :హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సుమారు 100 మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొనగంటి రాముకు పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం పొనగంటి రాము మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ప్రజలకు కనిపించే స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ప్రగతి పథంలో నడిచిందని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిందని గుర్తు చేసిన ఆయన, రాబోయే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్–జమ్మికుంట ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలు ఇంకా కొనసాగుతాయని బీఆర్‌ఎస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


