epaper
Tuesday, March 10, 2026
epaper

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే
బీఆర్ఎస్–బీజేపీలకు ప్ర‌జ‌లు బుద్ది చెబుతారు
గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల

కాకతీయ, కరీంనగర్ : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్ పీఠం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. గురువారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 28వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో ఆ డివిజన్‌కు చెందిన 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి మరిచారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతి, అక్రమాల్లోనే మునిగిపోయారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రజలపై నకిలీ ప్రేమ చూపించడం మినహా వారి వద్ద చెప్పుకోదగిన అభివృద్ధి లేదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా కరీంనగర్ అభివృద్ధికి చేసిన కృషి శూన్యమని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాస్కర్ నాయక్, పులి రమేష్, పులి అనిల్, బోయిని దేవరాజు, గుండేటి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని...

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టరేట్...

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్ కాకతీయ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి...

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి...

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం -భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక...

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు..

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూర్, నల్లా వెంకయ్యపల్లి...

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల...

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img