మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం
రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు
బాధిత కుటుంబానికి అండగా రడం భరత్
కాకతీయ, గీసుగొండ: మొంథా తుఫాన్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి నాయకుడి చొరవతో ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. మండలంలోని రాంపురం శివారు గట్టుకింది పల్లెకు చెందిన పులి అనిల్ వరద నీటిలో కొట్టుకుపోయి శివనగర్ డ్రైనేజీలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మొదటి రోజు నుంచే కుటుంబానికి అండగా నిలిచిన రడం భరత్ ప్రభుత్వ సహాయం అందేలా కీలకంగా చొరవ చూపారు. సంబంధిత అధికారులతో నిరంతర సమన్వయం ఫలితంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల సహాయం త్వరితగతిన మంజూరైంది. ఈ మేరకు పులి అనిల్ భార్య పులి మమతకు చెక్కును రడం భరత్ చేతుల మీదుగా అందజేశారు. తమ కుటుంబానికి సకాలంలో సహాయం అందేలా ప్రధాన పాత్ర పోషించిన రడం భరత్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంచనగిరి సర్పంచ్ కమలబిక్షపతి, సూర్య తండ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్, రాంపూర్ ఉపసర్పంచ్ పులి సూరయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


