ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
సర్పంచ్ మాదరి ప్రశాంత్
కాకతీయ, నెల్లికుదురు : ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. మండలం లోని శ్రీరామగిరి గ్రామంలో బుధవారం ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాసులను గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ చేతులమీదుగా లబ్దిదారులు నర్సింగ మానస శ్రీకాంత్ కి శ్రీధర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ పొయ్యిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకాన్ని పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ దారం సందీప్, స్థానిక వార్డు మెంబర్ అరపెల్లి వినోద్, అరపెల్లి పవన్, కుమార్,అరపెల్లి వేరస్వామి తదితరులు పాల్గొన్నారు.


