శివనగర్‌లో కమిషనర్ పర్యటన
స్థానిక సమస్యలపై సమీక్ష
కాకతీయ, ఖిలావరంగల్: చాహత్ బాజీపేయి శివనగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ శానిటేషన్, డ్రైనేజీ, రహదారులు, స్మశాన వాటిక అభివృద్ధి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా రెండు స్వచ్ఛ ఆటోలు అవసరమని, పబ్లిక్ ప్రదేశాల్లో డంపర్ బిన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద కాలువ పనులు త్వరగా పూర్తి చేసి ఖమ్మం రోడ్డును క్లియర్ చేయాలని, మేడారం జాతర దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్మశాన వాటికలో సీసీ రోడ్లు, లైటింగ్, స్నానాల గదులు ఏర్పాటు చేయాలని కోరగా అంచనాలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. బతుకమ్మ ఆటస్థలం–చెరువు అభివృద్ధి, ఓపెన్ జిమ్ ఏర్పాటు, ప్రభుత్వ స్థల రక్షణపై సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ రాజేష్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ అభినాష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఏఈ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.


