23న చేర్యాలకు మంత్రి సీతక్క రాక
కాకతీయ, చేర్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈ నెల 23న ( శుక్రవారం) చేర్యాలకు రానున్నట్లు ఆకునూరు గ్రామ సర్పంచి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము రవి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం కొమ్మురవి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క మండలంలోని ఆకునూరు, రాంపూర్ గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మద్దూరు మండలం నర్సయపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని అనంతరం చేర్యాల మున్సిపల్ లో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ తెలిపారు.


