గ్రామీణ క్రీడాకారులకు వరం సీఎం కప్..
ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ సహేంద్ర బిక్షపతి
కాకతీయ, రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2 ఎడిషన్ 2026 క్రీడా పోటీలు రాయపర్తిలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు గ్రామ సర్పంచ్ సహేంద్ర బిక్షపతి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ ఒక గొప్ప వేదికగా ఉపయోగ పడుతుందని అన్నారు.విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి,మండలం,జిల్లా,రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని పేర్కొన్నారు.క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సహేంద్ర బిక్షపతి, ఉప సర్పంచ్ మచ్చ రమేష్,పంచాయతీ కార్యదర్శి వల్లె వినోద్ కుమార్,బిల్ కలెక్టర్ మల్లయ్య,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్ విబి శర్మ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


