నిజానికి నిలువెత్తు నిదర్శనం ‘కాకతీయ’
ఆత్మకూరు సీఐ సంతోష్
కాకతీయ, ఆత్మకూరు : ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తున్న కాకతీయ తెలుగు దినపత్రిక నిజానికి నిదర్శనమని ఆత్మకూరు సీఐ సంతోష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కాకతీయ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా, స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యతను కాకతీయ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని ప్రశంసించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించడంలో కాకతీయ యాజమాన్యం చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ భాస్కర మూర్తి తన కార్యాలయంలో కాకతీయ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమాలతో కాకతీయ తెలుగు దినపత్రిక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఫరూక్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.



