టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా క్యాలెండర్‌ను ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎం.డి. అస్లాం ఖాన్, జిల్లా కార్యదర్శి సయ్యద్ ఏ. జిలాని ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కే. హసన్ పాషా, కోశాధికారి సయ్యద్ రహీం, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్.కే. యాకుబ్ పాషా, వైస్ ప్రెసిడెంట్లు ఎం.ఏ. గఫూర్, ఎస్.కే. అబ్దుల్ సమద్, ఎండి అబ్దుల్ సత్తార్, ఎండి హసీనా బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి హ్యాపీ ఉద్దీన్, కార్యవర్గ సభ్యులు ఎండి ఇలియాజ్, సయ్యద్ సోహెల్‌తో పాటు మైనార్టీ ఉద్యోగులు ఖలీల్ పాషా, నన్నే సాహెబ్, ఎండి రహీముద్దీన్, జరీనా, తాజుద్దీన్, సాదిక్ అలీ, ముజీబ్, సమరిన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


