అనారోగ్యంతో సర్పంచ్ తులసిరామ్ కన్నుమూత
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని బోటి తండాకు చెందిన నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ భూక్యా తులసిరామ్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ బోటి తండాకు చేరుకొని తులసిరామ్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న సమయంలోనే తులసిరామ్ అకాల మరణం కలిగించడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, చిమలపాడు మాజీ సర్పంచ్ మాలోత్ కిషోర్, బోటి తండా మాజీ సర్పంచ్ మౌనిక, పాటిమీదగుంపు మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీటీసీ ధనరాజ్, నాయకులు రవీందర్, చందర్, మతృ, రాజా తదితర స్థానిక నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.


